బాబుకు సరిగ్గా బ్రీఫ్ చేసి ఉండరు
ప్రత్యేక హోదాపై తన వ్యాఖ్యలు వక్రీకరించి తప్పుడు ప్రచారం చేయడాన్ని వైసీపీ విజయవాడ పార్లమెంటు అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ తీవ్రంగా ఖండించారు. ఆయన ప్రత్యేక హోదా అంశం [more]
ప్రత్యేక హోదాపై తన వ్యాఖ్యలు వక్రీకరించి తప్పుడు ప్రచారం చేయడాన్ని వైసీపీ విజయవాడ పార్లమెంటు అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ తీవ్రంగా ఖండించారు. ఆయన ప్రత్యేక హోదా అంశం [more]
ప్రత్యేక హోదాపై తన వ్యాఖ్యలు వక్రీకరించి తప్పుడు ప్రచారం చేయడాన్ని వైసీపీ విజయవాడ పార్లమెంటు అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ తీవ్రంగా ఖండించారు. ఆయన ప్రత్యేక హోదా అంశం ‘బోరింగ్ సబ్జెక్ట్’ అని అన్నట్లుగా ఉదయం నుంచి చంద్రబాబుతో సహా టీడీపీ వర్గాలు, మీడియాలో ప్రచారం చేస్తున్నాయి. దీనికి గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తన ప్రసంగం ఇంగ్లీష్ లో ఉందని, చంద్రబాబుకు ఎవరో సరిగ్గా బ్రీఫ్ చేసి ఉండదని ఎద్దేవా చేశారు. ఇంగ్లీష్ మాట్లాడే గల్లా జయదేవ్ తో నేనేమి మాట్లాడానో చంద్రబాబు ట్రాన్స్ లేట్ చేయించుకుంటే బాగుండేదన్నారు. తన ప్రసంగాన్ని కొంత భాగం కట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ఏ పార్టీ పోరాటం చేసిందో ప్రజలకు తెలుసన్నారు. తన గురించి బెజవాడ ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. కుట్రలు, కుతంత్రాలు వారి డీఎన్ఏలోనే ఉన్నాయన్నారు. టీడీపీ మైండ్ గేమ్ తన వద్ద చెల్లవని స్పష్టం చేశారు.