కాకినాడ ప్రచారంలో తీవ్రంగా గయపడిన వైసీపీఎమ్మెల్యే

Update: 2017-08-24 05:24 GMT

పాడేరు వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మెట్లపై నుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. కాకినాడ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఈశ్వరి ఆమె ఉంటున్న భవనం పైనుంచి దిగుతుండగా జారి పడిపోయారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఈశ్వరి కాకినాడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మంగళవారం ఉదయం మెట్లు దిగుతుండగా ప్రమాదానికి గురయ్యారు. మెట్లపై నుంచి పడిపోవడంతో ఎడమ కాలు విరిగింది. కొంత కాలం పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో స్వగ్రామానికి వెళ్లిపోయారు.

Similar News