Ys Jagan : జగన్ నేడు ప్రధాని మోదీతో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు.నేడు ప్రధాని మోదీని కలవనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న జగన్ రాత్రికి అక్కడే బస చేశారు. ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఉదయం పద కొండు గంటలకు ఆయన పార్లమెంటులో మోదీని కలవనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై ప్రధానితో జగన్ చర్చించనున్నారు.
రాష్ట్రానికి రావాల్సిన....
ఏపీ ఎన్నికలు సమీపీస్తున్న సమయంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు అవసరమైన నిధులను విడుదల చేసేందుకు ప్రధానిని సహకరించాలని కోరనున్నారు. అలాగే తెలంగాణ రాష‌్ట్రం నుంచి రావాల్సిన విద్యుత్తు బకాయీలను గురించి కూడా ప్రస్తావించనున్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలుపర్చాలని ఆయన కోరనున్నారు.
కేంద్ర మంత్రులను కలసి...
ప్రధాని మోదీకి జగన్ సమర్పించనున్న వినతిపత్రంలో ప్రత్యేక హోదా అంశం కూడా ఉందని తెలుస్తోంది. జగన్ ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లు కలసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. అయితే ప్రధానితో జరిగే భేటీలో రాజకీయ పరమైన అంశాలు కూడా చర్చించే అవకాశాలను కొట్టిపారేయలేం.