Andhra Pradesh : నేటి ఏపీ అసెంబ్లీ సమావేశాల అజెండా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి;

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి. నేడు ఏపీ అసెంబ్లీలో పీ4 విధానం, సంక్షేమంపై చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీ4 విధానపై సభకు మరోసారి వివరించే ప్రయత్నం చేయనున్నారు. దీంతో పాటు ఆయుర్వేద, హోమియోపతి వైద్య వృత్తిదారుల నమోదుపై సవరణ బిల్లును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రవేశపెట్టనున్నారు.
శాసనమండలిలో...
నేడు ఏపీ శాసనమండలిలో ఉద్యోగుల సమస్యలపై చర్చ జరగనుంది. భూహక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల సవరణ బిల్లును మండలిలో మంత్రి అనగాని సత్య ప్రసాద్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు స్వల్పకాలిక చర్చలు జరగనుంది. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు ప్రారంభమై ముగిసిన తర్వాత ఈ అజెండా అమలు కానుంది.