నేడు జగన్ ఢిల్లీ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. జగన్ ఈ సారి పర్యటన కీలకమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది;

Update: 2022-04-05 01:44 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. జగన్ ఈ సారి పర్యటన కీలకమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కేవలం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు మాత్రమే కాకుండా రాజకీయపరమైన అంశాలు కూడా ఈసారి పర్యటనలో చర్చకు వచ్చే అవకాశముంది. జగన్ నేరుగా ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై జగన్ ప్రధాని మోదీ చర్చించినా రాజకీయ అంశాలు కూడా చర్చకు రానున్నాయి.

రాజకీయ అంశాలే....
ప్రధానంగా ఏపీలో పొత్తుల అంశంతో పాటు జనసేన, టీడీపీ దగ్గరయ్యే అవకాశాలపై జగన్ ఢిల్లీ బీజేపీ పెద్దలతో చర్చించనున్నారు. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జరిగే చర్చల్లో రాజకీయ పరమైన అంశాలు చర్చుకు రానున్నాయి. ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే రాజకీయాలు వేడెక్కడం, జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు.


Tags:    

Similar News