Rain Alert : ఏపీలో నేడు వర్షం కురిసే ప్రాంతాలివే

ఆంధ్రప్రదేశ్ లో నేడు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ తెలిపింది;

Update: 2024-10-20 06:03 GMT
rain tody andhra pradesh, disaster management, control rooms, andhra pradesh
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ లో నేడు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ తెలిపింది. ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ నెల 21వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నందున ముందు జాగ్రత్త చర్యగా విశాఖ జిల్లాలో పథ్నాలుగు కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసింది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.

ఈ జిల్లాల్లో...
ఈరోజు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, విశాఖ, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, ఉభయ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది.


Tags:    

Similar News