ఏపీ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తులు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తుల నియామకం జరిగింది;

Update: 2022-02-10 14:35 GMT

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తుల నియామకం జరిగింది. ఈ మేరకు న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏడుగురికి పదోన్నతి కల్పించాలని గత నెల 29వ తేదీన కొలీజియం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.

పదోన్నతులు....
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులుగా కొనగంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, రాజశేఖర్ రావు, సత్తి సుబ్బారెడ్డి, చీముల పాటి రవి, వి. సుజాతలు న్యాయమూర్తులుగా నియమించారు. వీరిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.


Tags:    

Similar News