జీవోను వెనక్కు తీసుకున్న జగన్ సర్కార్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వం తాను జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కు తీసుకున్నట్లు తెలిపింది;
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వం తాను జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కు తీసుకున్నట్లు తెలిపింది. త్వరలోనే దీనిపై అఫడవిట్ దాఖలు చేస్తామని చెప్పింది. జీవో నెంబరు 59ను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తరుపున న్యాయవాదులు హైకోర్టుకు తెలియజేశారు. గురువారం జీవోనెంబరు 59 పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా జీవోను తాము వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.
గ్రామ కార్యదర్శులను....
వివరాల్లోకి వెళితే గ్రామ కార్యదర్శులను మహిళ కానిస్బేబుళ్లుగా మారుస్తూ జగన్ ప్రభుత్వం 59 నెంబరు పేరిట జీవో విడుదల చేసింది. అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గ్రామ కార్యదర్శులను కానిస్టేబుళ్లుగా మార్చడమేంటని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరుగుతుండగానే ప్రభుత్వం హైకోర్టులో జీవో వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.