Breaking : తిరుమలలో చంద్రబాబు కీలక ప్రకటన.. ఆ భూములు రద్దు
తిరుమల పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.;

తిరుమల పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. తిరుపతిలో గత ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తిరుపతిలోని అలిపిరి సమీపంలో ముంతాజ్ హోటల్ తో పాటు దేవలోకకి 35 ఎకరాలను కేటాయిస్తూ గత వైసీపీ ప్రభుత్వం కేటాయించిందని చంద్రబాబు నాయడుు తెలిపారు. శ్రీవారి ఆలయంలో పనిచేసేవారు హిందువులే ఉండాలని చంద్రబాబు అన్నారు.
అలిపిరి వద్ద...
ఏడుకొండల వద్ద ఎలాంటి వాణిజ్య కార్యక్రమాలను నిర్వహించకూడదన్న చంద్రబాబు నాయుడు అలిపిరి వద్ద కేటాయించిన ముప్ఫయి ఐదు ఎకరాల భూమిని రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్వామీజీలు ఇటీవల ఆందోళన చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి వద్ద ఎలాంటి వాణిజ్య కార్యక్రమాలను నిర్వహించడానికి వీలు లేదని తెలిపారు.