రెండో రోజూ అంతే : వాయిదా
ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ కాలినడకన అసెంబ్లీకి టీడీపీ నేతలు చేరుకున్నారు.
రెండో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ కాలినడకన అసెంబ్లీకి టీడీపీ నేతలు చేరుకున్నారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వారు నినాదాలు చేస్తున్నారు. అక్రమ అరెస్ట్‌లను ఖండిస్తూ వారు కాలినడకన అసెంబ్లీకి ప్లకార్డులతో చేరుకున్నారు.రెండో రోజుకూడా టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరి ఆందోళనకు దిగారు. దరిద్రపు పాలన నశించాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు.
అంబటి వార్నింగ్...
ఈరోజు స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసుపై ప్రభుత్వం చర్చకు సిద్ధపడింది. అయితే ఇది తెలుగుదేశం పార్టీ కార్యాలయం కాదని, సభ్యులు హుందాగా వ్యవహరించాలని మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా టీడీపీ సభ్యులు ఆందోళన చేయడమేంటని వారు ప్రశ్నించారు. టీడీపీ సభ్యులు మాత్రం స్పీకర్ పోడియం వద్దనే నిల్చుని ఆందోళనకు దిగుతుండటంతో సభాకార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని వైసీపీ మంత్రులు హెచ్చరిస్తున్నారు. ప్రశ్నోత్తరాలను టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారు. దీంతో సభను స్పీకర్ కొద్ది సేపు వాయిదా వేశారు.