దసరా సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దసరా సెలవుల్లో స్వల్ప మార్పులు
ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దసరా సెలవుల్లో స్వల్ప మార్పులు చేస్తూ జీవో విడుదల చేసింది. ఈ నెల 23వ తేదీని సాధారణ సెలవుగా, 24వ తేదీని ఆప్షనల్ హాలిడేగా ఇంతకు ముందు ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా 24వ తేదీని ఆప్షనల్ హాలిడే బదులు సాధారణ సెలవుగా మార్చింది. దీంతో 23, 24 రెండు తేదీలు సాధారణ సెలవుగా మారాయి. ఈ నేపథ్యంలో ఏపీలో విద్యాసంస్థలు తిరిగి 25వ తేదీన తెరుచుకోనున్నాయి.
దసరా సెలవులు ఇలా:
ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ విద్యాశాఖ దసరా సెలవులు ప్రకటించించిన విషయం తెలిసిందే. మొత్తం 10 రోజులు పాటు దసరా సెలవులు ఉండనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవు తేదీల్లో స్వల్ప మార్పు చేసింది. అక్టోబర్ 23వ తేదీతో పాటు 24వ తేదీన కూడా సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 24న విజయదశమి సందర్భంగా సాధారణ సెలవు ప్రకటన వెలువడింది. బుధవారం ఉదయం సీఎస్ జవహర్ రెడ్డి జీవోఆర్‌టీ నంబర్ 2047ను విడుదల చేశారు. గతంలో దసరాను ఆప్షనల్ సెలవుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి స్వల్ప మార్పులతో సీఎస్ జవహర్ రెడ్డి తాజా ఉత్తర్వులను విడుదల చేశారు.