ఉచితంగా ఏపీలో మెడిసిన్స్ డోర్ డెలివరీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఫేజ్‌–2 జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో

Update: 2023-12-16 14:34 GMT

jaganannaarogyasuraksha

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఫేజ్‌–2 జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా గుర్తించిన వ్యాధిగ్రస్తులకు మందులు నేరుగా ఉచితంగా డోర్‌ డెలివరీ చేస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. మందులు అయిపోతే వాటి కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు.. ఆన్‌లైన్‌లోనే ఇండెంట్‌ తీసుకుని విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి ఏఎన్‌ఎంలు ద్వారా బాధితులకు చేరుస్తామని సమాచార, పౌర సంబంధాలు, బీసీ సంక్షేమ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. తపాలా శాఖ సహాయంతో వేగంగా, డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలు కలిగిన మందుల పంపిణీ చేస్తామని.. ఇందుకోసం ప్రత్యేక ఎస్‌ఓపీ రూపొందించామన్నారు. సూపర్‌ స్పెషాల్టీ సేవలందించే వైద్యులకు రూ.4 లక్షల వరకూ జీతాలు ఇస్తున్నాం. వైద్యశాఖలో 53 వేల పోస్టులను భర్తీ చేసి దాదాపు జీరో వేకెన్సీని తీసుకొచ్చామని.. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ.668 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలను కూడా చెల్లించామన్నారు.

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య పరిమితిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చడంతో రాష్ట్రంలో 90 శాతం కుటుంబాలు ఆరోగ్యశ్రీతో లబ్ధి పొందుతున్నాయి. ఆరోగ్యశ్రీ కొత్త కార్డుతో ఆస్పత్రికి వెళ్తే రూ.25 లక్షల వరకూ ఉచితంగా వైద్యం అందించనున్నారు. డిసెంబర్ 18న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీని ప్రారంభిస్తారు. గతంలో ఆరోగ్యశ్రీలో 1,059 ప్రొసీజర్స్‌ మాత్రమే ఉండగా, వైసీపీ ప్రభుత్వం వీటిని ఏకంగా 3,257కి పెంచింది.


Full View


Tags:    

Similar News