పరిశ్రమలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో

ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలను స్థాపించాలనే ఉద్దేశ్యం ఎవరికి ఉన్నా కూడా కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలో తాము

Update: 2024-02-16 07:39 GMT

ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలను స్థాపించాలనే ఉద్దేశ్యం ఎవరికి ఉన్నా కూడా కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలో తాము ఉన్నామంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే పలు మార్లు చెప్పారు. అందుకే ఆయా కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో ఉందని ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన భరోసాతో పెట్టుబడులకు పరిశ్రమలు ముందుకొస్తున్నాయని ప్రజలు కూడా నమ్ముతూ ఉన్నారు. పారిశ్రామికవేత్తలకు అన్ని అనుమతులు ఒకేచోట లభించేలా ‘వైఎస్సార్‌ ఏపీ వన్‌’ పేరుతో యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నాలుగున్నరేళ్లలో 130 భారీ, అతిభారీ ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా దాదాపు రూ.69 వేల కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. వీటి ద్వారా 86 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. మూడేళ్ల నుంచి సుల­భ­తర వాణిజ్యంలో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తోంది.

పారదర్శక పెట్టుబడుల కోసం ప్రభుత్వం ‘పారిశ్రామిక అభివృద్ధి విధానం–2023–27’ను తీసుకొచ్చింది. ‘వైఎస్సార్‌ జగనన్న బడుగు వికాసం’ పేరుతో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ఒక ప్రత్యేక పాలసీ. 9,140 ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు. వీటికి గత ప్రభుత్వం జూన్‌ 2019 నాటికి పెండింగ్‌లో పెట్టిన రూ. 3,409 కోట్ల ప్రోత్సాహకాలను ప్రస్తుత ప్రభుత్వం చెల్లించింది. 11,059 ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు సంబంధించిన రూ.1,324.53 కోట్ల బకాయిలతో పాటు రూ.962.05 కోట్ల బకాయిల (7,039 ఎంఎస్‌ఎంఈలకు మంజూరు) ఎరియర్లను కూడా అందజేసింది. 75 భారీ, మెగా యూనిట్లకు గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన రూ. 380.85 కోట్ల ప్రోత్సాహకాలను కూడా క్లియర్‌ చేసింది.
తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో ఆదిత్య బిర్లా గ్రూపు సుమారు రూ. 2,700 కోట్లతో కాస్టిక్‌ సోడా తయారీ యూనిట్‌ను 2022 ఏప్రిల్‌ 21న సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ యూనిట్‌ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,000 మందికి ఉపాధి లభించనుంది. వైఎస్సార్‌ జిల్లా బద్వేల్‌ సమీపంలోని గోపవరం వద్ద 482 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న సెంచురీ ప్యాన­ల్స్‌ తయారీ యూనిట్‌ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమా­రు రూ.1,600 కోట్లతో ఏర్పాటుచేస్తున్న ఈ యూనిట్‌ ద్వారా ప్రత్యక్షంగా 2,000 మందికి పరోక్షంగా 4,000 మందికి ఉపాధి లభించనుంది. ప్రముఖ మల్టీనేషనల్‌ కంపెనీ ఐటీసీ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతూ ఉంది. రూ.140 కోట్లతో వెల్‌కమ్‌ పేరుతో గుంటూరులో ఫైవ్‌స్టార్‌ హోటల్‌ను, రూ. 200 కోట్లతో గ్లోబల్‌ స్పైసెస్‌ పార్కులను ప్రారంభించింది. ఇలా ఎన్నో సంస్థలు ఏపీలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి.


Tags:    

Similar News