టీడీపీతో పొత్తా....? ఎవరు చెప్పారు?

తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని తాము ఎక్కడ చెప్పలేదని బీజేపీ రాష్ట్ర అధ్కక్షుడు సోము వీర్రాజు అన్నారు.;

Update: 2022-03-20 11:58 GMT

తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని తాము ఎక్కడ చెప్పలేదని బీజేపీ రాష్ట్ర అధ్కక్షుడు సోము వీర్రాజు అన్నారు. కర్నూలులో జరిగిన పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 ఎన్నికల్లో తాము జనసేనతో కలసి వెళతామని మాత్రమే చెప్పామని సోము వీర్రాజు తెలిపారు. ఈ మేరకు బీజేపీ కేంద్ర నాయకత్వం ఏపీ ఎన్నికల కోసం రోడ్డు మ్యాప్ తయారు చేస్తుందని చెప్పారు. టీడీపీతో పొత్తు ఉంటుందని మీడియా సృష్టి మాత్రమేనని సోము వీర్రాజు అన్నారు.

అధికారం మాదే...
వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని అధికారంలో నుంచి దించి బీజేపీ, జనసేన పవర్ లోకి వస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదా ఏపీకి ఇస్తామని తాము ఎక్కడా చెప్పలేదనన్నారు. హోదా కంటే ప్యాకేజీ తోనే నిధులు ఎక్కువ వస్తాయని అసెంబ్లీలో ప్రకటించిన చంద్రబాబు చివరకు యూటర్న్ తీసుకున్నారని చెప్పారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులపై తాము చర్చకు సిద్దమని ఆయన సవాల్ విసిరారు. ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధులు ఏపీకి ఇచ్చిందని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News