హైకోర్టు అదనపు భవనానికి సీజే శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు భవన సముదాయ నిర్మాణానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా భూమి పూజ చేశారు.;
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు భవన సముదాయ నిర్మాణానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా భూమి పూజ చేశారు. ప్రస్తుతం అమరావతిలోని నేలపాడులో ఉన్న హైకోర్టు భవనానికి ఎదురుగా ఉన్న మూడు ఎకరాల్లో ఈ అదనపు భవనాలను నిర్మించనున్నారు. ఈ అదనపు భవనాల నిర్మాణం కోసం 33.50 కోట్ల రూపాయలను అంచనా వేశారు. జీ+3 భవన సముదాయాన్ని ఇక్కడ నిర్మించనున్నారు.
ఆరు నెలల్లో.....
ఈ భవన నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయాలని కాల పరిమితిని నిర్దేశించారు. కొత్త భవనం నిర్మాణంతో హైకోర్టుకు అదనంగా 76,300 చదరపు అడుగుల వసతి సమకూరుతంది. ఈ భవనంలో లైబ్రరీతో పాటు రికార్డు రూము, కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల సమావేశ మందిరాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.