నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్

నేడు ఢిల్లీ వెళ్లి.. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయల్దేరుతారు.;

Update: 2022-04-29 04:19 GMT
ys jagan, chief minister, delhi
  • whatsapp icon

తాడేపల్లి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చారు. తాజాగా మరోసారి ఆయన ఢిల్లీ పర్యటనకు బయల్దేరనున్నారు. నేడు ఢిల్లీ వెళ్లి.. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయల్దేరుతారు. సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ అనంతరం.. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఏప్రిల్ 30న జరిగే జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో జగన్ పాల్గొననున్నారు.

ఈ సదస్సుకు ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ సహా.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొననున్నారు. ఈ సదస్సులో ప్రధానంగా.. న్యాయ, కేసుల సత్వర పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై చర్చించనున్నారు. కాగా.. ప్రధాని మోదీతో భేటీలో విశాఖ పాలనా రాజధాని అంశాన్ని జగన్ ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


Tags:    

Similar News