జగన్ పాలనపై నిప్పులు చెరిగిన డీఎల్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు;
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని అన్నారు. జగన్ మూడేళ్ల పాలనలో రాష్ట్రం పూర్తి స్థాయిలో దివాలా తీసిందని డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. దావోస్ లో ఫేక్ అగ్రిమెంట్లు చేసుకుని, సొంత పనులను చూసుకుని వచ్చారని డీఎల్ రవీంద్రారెడ్డి తెలిపారు. జగన్ పాలన అంతా విధ్వసంగానే కొనసాగిందని ఆయన అభిప్రాయపడ్డారు.
వైఎస్ వివేకా హత్య కేసులో....
వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరో జగన్ కు తెలుసునని డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో వైఎస్ వివేకా హత్యను ఉపయోగించుకుని గెలుపు సాధించారని డీఎల్ పేర్కొన్నారు. జగన్ పాలన పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారని మాజీ మంత్రి డీఎల్ అభిప్రాయపడ్డారు.