టీడీపీకి షాక్.. మాజీ మంత్రి మృతి
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ మృతి చెందారు. ఆయన ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ మృతి చెందారు. ఆయన ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు. గుంటూరు జిల్లాకు చెందిన పుష్పరాజ్ 1983లో తాడికొండ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. సీనియర్ నేతగా, ఎస్సీ శాసనసభ్యుడిగా ఉన్న పుష్పరాజ్ గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో కీలక వ్యక్తిగా పనిచేశారు.
తొలి నుంచి టీడీపీలో...
1985లో టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఎన్టీఆర్ ఆయనను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 1999లో మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు పుష్పరాజ్ కు రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారు. 2021 వరకూ ఆయన ఆ పోస్టులో పనిచేశారు. ఆయన తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి నమ్మకమైన నేతగా కొనసాగారు. ఆయన అకాల మృతి పట్ల చంద్రబాబు సంతాపం ప్రకటించారు. పుష్పరాజ్ పార్టీకి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.