ఈ నెల 17న తిరుపతిలో బహిరంగ సభకు అనుమతి
అమరావతి రైతులు తిరుపతిలో తలపెట్టిన బహిరంగ సభకు హైకోర్టు అనుమతిచ్చింది. అయితే కొన్ని ఆంక్షలు విధించింది.;
అమరావతి రైతులు తిరుపతిలో తలపెట్టిన బహిరంగ సభకు హైకోర్టు అనుమతిచ్చింది. అయితే కొన్ని ఆంక్షలు విధించింది. బహిరంగ సభ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు మాత్రమే జరుపుకోవాలని చెప్పింది. తిరుపతి రూరల్ పరిధిలో ఈ సభను జరుపుకోవడానికి హైకోర్టుల అనుమతిచ్చింది.
చంద్రబాబుతో సహా....
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ న్యాయస్థానం టు దేవస్థానం పేరిట పాదయాత్ర పూర్తి చేసుకున్న రైతులు ఈ నెల 17వ తేదీన తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాలనుకున్నారు. కానీ పోలీసులు అందుకు అనుమతివ్వలేదు. దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో ఎల్లుండి తిరుపతి లో బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు తమకు మద్దతిచ్చిన రాజకీయ పార్టీ నేతలను ఆహ్వానిస్తున్నారు. చంద్రబాబు కూడా ఈ సభకు హాజరయ్యే అవకాశముంది.