నేడు హైకోర్టులో విచారణ.. థియేటర్ల యజమానుల సమావేశం

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ ధరలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. జీవో 35 ను హైకోర్టు ఇప్పటికే రద్దు చేసింది.;

Update: 2021-12-27 03:48 GMT

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ ధరలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. జీవో నెంబరు 35 ను హైకోర్టు ఇప్పటికే రద్దు చేసింది. అయినా సినిమా థియేటర్లపై ప్రభుత్వం దాడులు నిర్వహిస్తుండటంతో అనేక సినిమా హాళ్లను యజమానులు మూసివేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న దాడులను సినీ థియేటర్ల యాజమాన్యం నిరసిస్తుంది. ఈ దాడుల్లో దాదాపు యాభై థియేటర్లు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని అధికారులు సీజ్ చేశారు.

భవిష్యత్ కార్యాచరణకు...
దీనిపై భవిష్యత్ కార్యాచరణను రూపొందించడానికి నేడు థియేటర్ల యజమానులు సమావేశం కాబోతున్నారు. ఈరోజు రాజమండ్రిలో జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ల యజమానులు హాజరుకానున్నారు. టిక్కెట్ ధరల తగ్గింపు, ప్రభుత్వ దాడులపై ఈ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.


Tags:    

Similar News