ఏపీ సినిమా టిక్కెట్ల పై నేడు హైకోర్టులో?
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టెక్కెట్ల ధరల నిర్ణయంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది;
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టెక్కెట్ల ధరల నిర్ణయంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. జీవో నెంబరు 35ను సింగిల్ బెంచ్ కొట్టేయడంతో ప్రభుత్వం డివిజనల్ బెంచ్ ను ఆశ్రయించింది. ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలను నిర్ణయిస్తూ ప్రభుత్వం జీవో నెంబరు 35 ను జారీ చేసింది.
విచారణలో....
దీనిని వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. అయితే సింగిల్ బెంచ్ ను కొట్టేయడంతో సామాన్యులకు టిక్కెట్ ధరలు అందుబాటులో ఉండాలన్న కారణంగానే సదుద్దేశంతో ఈ జీవోను తెచ్చామని ప్రభుత్వం డివజనల్ బెంచ్ ను ఆశ్రయించింది. దీనిపై నేడు విచారణ జరిపి ఉత్తర్వులు ఇవ్వనుంది.