భారీగా తగ్గిన తిరుమల హండీ ఆదాయం

తిరుమలలో స్వామి వారి హుండీ ఆదాయం భారీగా తగ్గింది. నిన్న కేవలం 1.82 కోట్ల రూపాయలు మాత్రమే హుండీ ఆదాయం వచ్చింది;

Update: 2022-09-30 02:58 GMT

తిరుమలలో స్వామి వారి హుండీ ఆదాయం భారీగా తగ్గింది. నిన్న కేవలం 1.82 కోట్ల రూపాయలు మాత్రమే హుండీ ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 61,879 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,634 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. ఉదయం కల్పవృక్ష వాహనంపై మాడవీధుల్లో శ్రీవారు దర్శనమిస్తారు.

29 కంపార్ట్‌మెంట్లలో...
నేడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరి దర్శనానికి పదిహేను గంటలకు పైగా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. రాత్రికి సర్వ భూపాల వాహనంపై స్వామి వారు ఊరేగనున్నారు. రాత్రి 12 గంటల నుంచి ఘాట్ రోడ్ లో ద్విచక్ర వాహనాలను నిలిపివేయనున్నారు.


Tags:    

Similar News