జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్

జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. డివిజన్ బెంచ్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.;

Update: 2021-12-13 07:47 GMT

జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. డివిజన్ బెంచ్ లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. జగనన్న విద్యా దీవెన పథకం కింద తల్లుల ఖాతాల్లో జమ చేయడాన్ని తప్పుపడుతూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. అయితే తల్లుల ఖాతాల్లో జమ చేయడానికి వీల్లేదని గతంలో సింగిల్ బెంచ్ తీర్పు చెప్పింది.

ప్రభుత్వ రివ్యూ పిటీషన్ ను...
దీనిపై డివిజన్ బెంచ్ లో జగన్ ప్రభుత్వం రివ్యూ పిటీషన్ వేసింది. అయితే ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రయివేటు విద్యాసంస్థల యాజమన్యాల తరుపున కృష్ణ దేవరాయ వర్సిటీ అసోసియేషన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసింది. డివిజన్ బెంచ్ లోనూ జగన్ ప్రభుత్వానికి చుక్కెదురయింది.


Tags:    

Similar News