ఇద్దరు వైసీపీ ఎంపీలకు కరోనా
కాకినాడ ఎంపీ వంగా గీత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కరోనా బారిన పడ్డారు.;
పార్లమెంటు సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయ. అయితే ప్రజాప్రతినిధులను కరోనా వదలిపెట్టడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. రోజుకు పదమూడు వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండాల్సి రావడంతో వారు కరోనా బారిన పడుతున్నారు.
ప్రజా క్షేత్రంలో....
తాజాగా కాకినాడ ఎంపీ వంగా గీత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కరోనా బారిన పడ్డారు. వీరిద్దరికీ స్వల్ప లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో వారు హోం ఐసొలేషన్ లోకి వెళ్లారు. తమను వారం రోజుల నుంచి కలసిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఎంపీలు ఇద్దరూ కోరారు.