పవన్ ఫోన్ తో...జోగయ్య దీక్ష విరమణ
కాపు సంక్షేమ సేన నేత హరిరామ జోగయ్య ఆమరణ దీక్షను విరమించారు;
కాపు సంక్షేమ సేన నేత హరిరామ జోగయ్య ఆమరణ దీక్షను విరమించారు. ఏలూరు ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న జోగయ్యకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోన్ చేశారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా దీక్ష విరమించుకోవాలని కోరారు. కాపు రిజర్వేషన్ల కోసం ఆయన ఆమరణ దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకుని ఆసుపత్రిలో చేర్చినా ఆయన మాత్రం తాను దీక్ష కొనసాగిస్తానని చెప్పారు.
మాట్లాడుకుందామని...
అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోన్ చేసి అందరం కలసి కూర్చుని మాట్లాడుకుందామని, సమస్యపై చర్చించుకుందామని పవన్ కల్యాణ్ ఫోన్ లో తెలిపారు. దీంతో జోగయ్య దీక్ష విరమించారు. పవన్ కల్యాణ‌్ విజ్ఞప్తి చేయడం వల్లనే తాను దీక్షను విరమిస్తున్నట్లు హరిరామ జోగయ్య తెలిపారు. మరికాసేపట్లో ఆయన ఏలూరు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశాలున్నాయి.