Andhra Pradesh : నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అదే అంశాలు ప్రధానంగా?
నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.;
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వివిధ అంశాలపై చర్చించనున్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాలపై ఉంచాల్సిన బిల్లుల విషయంపై కేబినెట్ సమావేశం చర్చించనుందని తెలిసింది. ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై అసెంబ్లీలో చర్చించే అవకాశముందని చెబుతున్నారు.
అసెంబ్లీ సమావేశాలపై...
ఉచిత ఇసుక పాలసీ విధానంపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. దీంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుపర్చడంపై కూడా కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. దీంతో పాటు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించే విషయంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారని తెలిసింది. అక్రమాలను వెలికి తీసి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని, అందుకోసం అవసరమైతే మరిన్ని విచారణలకు ఆదేశించేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు.