ద్వారకా తిరుమల వద్ద చిరుత పులి సంచారం
పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారాకా తిరుమల మండలం నాగులపల్లిలో చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది;

leapord in tirumala
పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారాకా తిరుమల మండలం నాగులపల్లిలో చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది. ఇక్కడ చిరుత పులి సంచరిస్తుందని స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో చిరుతపులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా బోన్లను ఏర్పాటు చేశారు. బోన్లలో చిరుత పులికి ఎరగా మేకలను ఉంచారు.
బోనులు ఏర్పాటు చేసి...
ిరహదారిపైకి చిరుత రావడంతో గమనించిన స్థానికులు భయపడిపోయారు. అయితే రైతులు ఎవ్వరూ ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పశువుల కాపర్లు కూడా మేత కోసం వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. చిరుతపులిని బంధించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. స్థానికుల్లో మాత్రం ఆందోళన కొనసాగుతుంది.