జగన్ వెంటే నా ప్రయాణం
మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి తాను జగన్ వెంటే ఉంటానని చెప్పారు;
మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి తాను జగన్ వెంటే ఉంటానని చెప్పారు. మడకశిర నియోజకవర్గంలో బీఫారం తనకు ఇచ్చేంత వరకూ ప్రయత్నిస్తూనే ఉంటానని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ తాను వైసీపీకి, వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అనలేదనన తిప్పేస్వామి తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్లనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.
పార్టీ మారబోను...
తాను ఎట్టిపరిస్థితుల్లో పార్టీ మారబోనని చెప్పారు. జగన్ ను వదిలి పెట్టే ప్రసక్తి లేదని తిప్పేస్వామి తెలిపారు. కొన్ని కారణాలతో మడకశిర కు కొత్త ఇన్‌ఛార్జి నియామకం జరిగిందని, తాను నలభై ఏళ్ల పాటు వైఎస్ కుటుంబాన్నే నమ్ముకుని ఉన్నానని చెప్పారు. అందుకే వాళ్లతో కొట్లాడి అయినా టిక్కెట్ అడిగే స్వతంత్రం తనకు ఉందని, చివరి వరకూ టిక్కెట్ కోసం తాను ప్రయత్నిస్తూనే ఉంటానని చెప్పారు.