నేడు తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్
ఆంధ్రప్రదేశ్ లో నేడు కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది;
ఆంధ్రప్రదేశ్ లో నేడు కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలోని ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
తెలంగాణలో ఎల్లో అలర్ట్...
ఈ నెల7వ తేదీన వాయవ్యవ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, దీనివల్ల నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతాయని తెలిపింది. ఈ కారణంగా ఈనెల 7, 8 తేదీల్లో దక్షిణ కోస్తాలో ఒక మోస్తరుగా, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింి. ఇక ఈరోజు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. 17 జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.