ఏమని మాట్లాడమంటారు: నారా భువనేశ్వరి
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడును ఆయన కుటుంబ సభ్యులు
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడును ఆయన కుటుంబ సభ్యులు పరామర్శించారు. తన భర్త చంద్రబాబు నాయుడు 24 గంటలూ ఆంధ్రప్రదేశ్ కోసమే కష్టపడేవారని నారా భువనేశ్వరి అన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జైలులో ఉన్నారని ములాఖత్ తర్వాత భువనేశ్వరి అన్నారు. ముందు ప్రజలు ముఖ్యం.. ఆ తర్వాత కుటుంబం అనే విషయాన్ని ఎప్పుడూ ఆయన చెబుతూ ఉండేవారని తెలిపారు భువనేశ్వరి. చంద్రబాబు నాయుడు నిర్మించిన ఆ బిల్డింగ్ లోనే ఈరోజు జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నారని భువనేశ్వరి అన్నారు.
ఏమీ లేని కేసులో ఇరికించారని ఆరోపించారు భువనేశ్వరి. మీరు అందరూ బయటకు వచ్చి.. పోరాడాలని ప్రజలను కోరారు భువనేశ్వరి. ఇది చాలా టఫ్ టైమ్ అని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎక్కడికీ వెళ్ళదని.. మా కుటుంబం టీడీపీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. జైలులో కూడా ఆయన ప్రజల గురించి మాతో మాట్లాడారని అన్నారు. తన ఆరోగ్యం బాగుందని ఆయన చెప్పారని అన్నారు. చల్లనీళ్ళతో ఆయన స్నానం చేస్తున్నారని తెలిపారు. భోజనం వంటి విషయాలన్నీ నారా లోకేష్ చూసుకుంటూ ఉన్నారని భువనేశ్వరి తెలిపారు.