మహానంది క్షేత్రంలో మరో సారి చిరుత పులి
మహానంది క్షేత్రంలో మరో సారి చిరుత పులి కలకలం రేపుతుంది.
మహానంది క్షేత్రంలో మరో సారి చిరుత పులి కలకలం రేపుతుంది. గత కొద్ది రోజులుగా మహానంది పుణ్య క్షేత్రం పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ చిరుతపులిని అటవీ శాఖ అధికారులు బంధించలేకపోయారు. భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తరచూ చిరుతపులి కనిపిస్తుండటం, స్థానికులు అరుస్తుండటంతో అది పరారయి వెళ్లిపోతుండటంతో ప్రాణ హాని జరగలేదు కాని ఆందోళన మాత్రం తగ్గలేదు.
పశు క్షేత్రం వద్ద....
తాజాగా ఒక ఒంగోలు జాతి పశువుల పెంపకం కేంద్రం వద్దకు చిరుత వచ్చినట్లు గుర్తించారు. సీసీ టీవీ కెమెరాలో చిరుత కదలికలు రికార్డయ్యాయి. అయితే కేంద్రం వద్ద ఉన్న కాపలాదారులు పెద్దగా కేకలు వేయడంతో చిరుతపులి అక్కడి నుంచి పరారయింది. నల్లమల అటవీ ప్రాంతానికి అతి సమీపంలో ఈ పశు క్షేత్రం ఉండటంతో చిరుతపులి అక్కడకు వచ్చిందని భావిస్తున్నారు. ఇప్పటికే మహానంది పుణ్యక్షేత్రంలో రాత్రి వేళ ఒంటరిగా తిరగరాదని, పెంపుడు జంతువులను బయట వదలరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.