నారా బ్రాహ్మణిని పోసాని అడుగుతోంది ఇదే!

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై నారా బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యల పట్ల

Update: 2023-09-19 11:17 GMT

చంద్రబాబు అరెస్ట్ అక్రమం.. అన్యాయం.. అంటూ నారా బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్, సినీ ప్రముఖుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. నారా బ్రాహ్మణి మాటలు నవ్వుకునేలా ఉన్నాయని.. బ్రాహ్మణి మాటలు వింటుంటే న్యాయమూర్తి మీద కూడా కేసు పెట్టాలేమో అని అన్నారు పోసాని. నారా బ్రాహ్మణి తాను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని పోసాని డిమాండ్ చేశారు. మీ తాతయ్యను ఎవరు వెన్నుపోటు పొడిచారు? మీ తాతయ్యను చెప్పుతో కొట్టింది ఎవరు? మీ తాతయ్యను చంపింది ఎవరు? అంటూ ప్రశ్నించారు.

ప్రజల కోసమే జైలుకు వెళ్లానని చెబుతున్న చంద్రబాబు, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిందీ, 23 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నది కూడా ప్రజల కోసమేనా? అని పోసాని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడినవాళ్లనే జైలుకు పంపుతారని పోసాని వ్యాఖ్యానించారు. ఏ దిక్కైనా వెళ్లండి బాగుపడతారు. దిక్కుమాలిన చంద్రబాబు వైపు మాత్రం వెళ్లకండని పోసాని చెప్పుకొచ్చారు. దివంగత ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచావు.. ఒప్పుకోవు. ఎన్టీఆర్‌ను చంపావు.. ఒప్పుకోవు. జైల్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఏడాదో.. ఏడాదిన్నరో ఉండొచ్చు కదా. జైల్లో ఉండి ర్యాలీలు, ధర్నాలతో నీకేం పని. దోమల మందు.. మంచి దోమ తెర కొనిపెడతా. రెండు ఏసీలు కొనిపెడతా తీసుకెళ్లి జైల్లో చంద్రబాబుకి ఇవ్వండి అని అన్నారు పోసాని. చంద్రబాబు 17 సార్లు కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్నాడని, దేశంలో ఎవరికీ ఇన్ని స్టేలు తెచ్చుకున్న చరిత్ర లేదని అన్నారు. చంద్రబాబు అవినీతిపరుడని ప్రధాని మోదీనే చెప్పారని పోసాని గుర్తు చేశారు.


Tags:    

Similar News