Chandrababu : నేడు విజయవాడకు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు విజయవాడకు రానున్నారు.;

Update: 2023-12-01 02:51 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు విజయవాడకు రానున్నారు. ఆయన ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం విజయవాడ బయలుదేరి రానున్నారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లిన తర్వాత బెయిల్ పై వచ్చి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్‌లోనే ఉన్న చంద్రబాబు చాలా రోజుల తర్వాత విజయవాడకు వస్తుండటంతో పెద్దయెత్తున స్వాగతం తెలిపేందుకు కార్యకర్తలు సన్నాహాలు చేసుకుంటున్నారు. మధ్యాహ్నానికి ఆయన విజయవాడ చేరుకోనున్నారు.

పార్లమెంటరీ సమావేశం...
ఈరోజు సాయంత్రం తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం జరగనుది. రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించే వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. తర్వాత సీనియర్ నేతలతో ఆయన సమావేశమవుతారని తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించనున్నారు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలను జనసేనతో కలసి ఎలా చేయాలన్న దానిపై కూడా ఆయన చర్చించే అవకాశముంది.


Tags:    

Similar News