Chandrababu : నేడు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారణ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. నిన్న విచారణ జరగగా ఈరోజుకు వాయిదా వేసింది. తన వాదనలను వినిపించేందుకు మరికొంత సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ కోరగా ఈరోజుకు హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.
క్విడ్ ప్రోకో జరిగిందని...
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పెద్దయెత్తున అవకతవకలు జరిగాయని, క్విడ్ ప్రోకో జరిగిందని ఆరోపిస్తూ సీఐడీ కేసు నమోదు చేసింది. తమకు అనుకూలంగా మార్చుకుని, తమ భూములకు అధిక ధరలను వచ్చేలా ప్రయత్నించారని సీఐడీ ఆరోపిస్తుంది. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చడంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసుకున్నారు.