Breaking : మళ్లీ అధికారంలోకి వస్తున్నామన్న జగన్.. దేశం షాక్ అవ్వడం ఖాయమన్న వైసీపీ చీఫ్

మరోసారి అధికారంలోకి వస్తున్నామని వైసీపీ అధినేత జగన్ అన్నారు.;

Update: 2024-05-16 07:37 GMT

మరోసారి అధికారంలోకి వస్తున్నామని వైసీపీ అధినేత జగన్ అన్నారు. రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రాబోతున్నామని ఆయన తెలిపారు. ఐప్యాక్ కార్యాలయానికి వచ్చిన జగన్ అక్కడి ప్రతినిధులతో మాట్లాడారు. గత ఎన్నికల్లోనూ ఎవరూ 151 సీట్లు వస్తాయని నమ్మలేదన్నారు. ఈసారి కూడా అంతకంటే ఎక్కువ స్థానాలు వస్తాయని చెప్పారు.




దేశం షాక్ అవుతుంది...
ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు. వచ్చే ఫలితాలను చూసి దేశం మొత్తం షాక్ అవుతుందని జగన్ తెలిపారు. ఎంపీ సీట్లు కూడా గతం కంటే ఎక్కువ వస్తాయని ఆయన తెలిపారు. శాసనసభ స్థానాలు కూడా గతం కంటే ఎక్కువ వస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా ఐప్యాక్ టీం ప్రతినిధుల సేవలను ఆయన ప్రశంసించారు.


Tags:    

Similar News