అలా ఆటో ఎక్కితే ఇక అంతే... న్యూ ఇయర్ బొనాంజా
కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలను దోచుకునేందుకు సిద్దమయింది.
కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలను దోచుకునేందుకు సిద్దమయింది. పెట్రోలు, గ్యాస్ ధరలను పెంచడంతో పాటు ప్రతి కొనుగోలుపైనా జీఎస్టీ వసూలు చేస్తుంది. పారిశ్రామికవేత్తలకు అడ్డగోలుగా రాయితీలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆటోలో ప్రయాణిస్తే జీఎస్టీ చెల్లించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఇకపై బుక్ చేసుకున్న ఆటోలో ప్రయాణిస్తే ఐదు శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
నూతన ఏడాది నుంచి....
వచ్చే ఏడాది జనవరి ఒకటవ తేదీ నుంచి ఈ నిబంధనల అమలులోకి వస్తుంది. ఊబర్, ఓలా వంటి సంస్థల ద్వారా ఆటోలు బుక్ చేసుకుని ప్రయాణిస్తే ఐదు శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ తెలిపింది. ఇది సామన్య, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది.