Kejrival : కేజ్రీవాల్ సమాధానం చెప్పడం లేదు.. విచారణకు సహకరించడం లేదు
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరో నాలుగు రోజులపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి న్యాయస్థానం ఆదేశించింది
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరో నాలుగు రోజులపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటికే ఆరు రోజుల పాటు కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ను మరో నాలుగు రోజులు అప్పగించింది. కేజ్రీవాల్ కస్టడీ నేడు పూర్తికావడంతో కేజ్రీవాల్ ను ఢిల్లీ రౌస్ అవెన్యూ న్యాయస్థానంలో హాజరుపర్చారు. కేజ్రీవాల్ తమ విచారణకు సహకరించలేదని తమకు మరో ఏడు రోజుల కస్టడీకి అప్పగించాలని ఈడీ తరుపున న్యాయవాదులు కోరారు.
మరో నాలుగు రోజులు...
సమాధానాలను దాట వేశారని, ఆయనతో పాటు గోవా ఆప్ ఎమ్మెల్యేలను కూడా కలపి విచారించాల్సి ఉన్నందున మరో ఏడు రోజల పాటు కస్టడీకి అనుమతించాలని కోరారు. అయితే న్యాయస్థానం మాత్రం నాలుగు రోజుల పాటు కస్టడీకి అప్పగించింది. ఏప్రిల్ ఒకటో తేదీన ఉదయం తమ ఎదుట హాజరు పర్చాలని ఈడీ అధికారులను ఆదేశించింది. దీంతో కేజ్రీవాల్ ను ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు.