Rain Alert : తమిళనాడులో దంచి కొడుతున్న వర్షాలు
తమిళనాడులో వర్షాలు దంచి కొడుతున్నాయి. దానా వర్షం ప్రభావంతో ఈరోజు నుంచే వాతావరణం మారింది
తమిళనాడులో వర్షాలు దంచి కొడుతున్నాయి. దానా వర్షం ప్రభావంతో ఈరోజు నుంచే వాతావరణం మారింది. భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రజలు అనేక చోట్ల ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను తమిళనాడు ప్రభుత్వం కొనసాగిస్తుంది. అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను తిరిగి పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు అందాయి.
ఎల్లో అలెర్ట్...
అనేక జిల్లాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో రోడ్లన్నీ జలమయిమయ్యాయి. చెరువులను తలపిస్తున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు స్థంభించాయి. వాహనాలు మొరాయిస్తున్నాయి. ప్రధానంగా టెంపుల్ స్టేట్ గా ఉన్న తమిళనాడుకు వచ్చిన భక్తులు భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. రైళ్లు కూడా కొన్ని రద్దు కావడంతో అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం కాంచీ పురం జిల్లాతో పాటు పదకొండు జిల్లాకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది.