భారత్ లో మూడున్నర వేలు దాటిన రోజువారీ కేసులు

కొద్దిరోజులుగా రోజువారి కేసులతో పాటు మరణాలు కూడా భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 4,96,640 శాంపిల్స్ ను..

Update: 2022-04-30 07:39 GMT

న్యూఢిల్లీ : దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిన తర్వాత రోజువారీ కేసులు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ విజృంభిస్తున్నాయి. కొద్దిరోజులుగా రోజువారి కేసులతో పాటు మరణాలు కూడా భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 4,96,640 శాంపిల్స్ ను పరీక్షించగా.. 3,688 కోవిడ్ కొత్తకేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదే సమయంలో మరో 50 మంది కరోనా బాధితులు మరణించినట్లు పేర్కొంది. శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో.. ప్రస్తుతం దేశంలో 18,684 యాక్టివ్ కేసులున్నట్లు వెల్లడించింది.

కేసులు పెరగడంతో.. రోజువారీ పాజిటివిటీ రేటు 0.74 శాతంగా ఉన్నట్లు కేంద్రం వివరించింది. కొత్తగా నమోదైన 3,688 కేసులు, 50 మరణాల్లో.. 1607 కేసులు, రెండు మరణాలు ఢిల్లీలోనే నమోదయ్యాయి. హర్యానాలో 624, కేరళలో 412, యూపీలో 293, మహారాష్ట్రలో 148 కేసులు నమోదయ్యాయి. ఇక వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఇప్పటివరకూ మొత్తంగా 188.89 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను అందించారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,755 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 4,25,33,377కి చేరింది.




Tags:    

Similar News