Big Breaking : అద్వానీకి భారతరత్న

లాల్్‌కృష్ణ అద్వానీకి దేశంలోనే అత్యున్నత పురస్కారం లభించింది. భారత రత్న అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించింది.;

Update: 2024-02-03 06:18 GMT
Big Breaking : అద్వానీకి భారతరత్న
  • whatsapp icon

లాల్్‌కృష్ణ అద్వానీకి దేశంలోనే అత్యున్నత పురస్కారం లభించింది. భారత రత్న అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. తొమ్మిది పదుల వయసులో ఉన్న వృద్ధతరం భారతీయ జనతా పార్టీ నేత లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న పురస్కారం లభించడంతో పార్టీ శ్రేణులు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నాయి. ఉపప్రధానిగా కూడా అద్వానీ పనిచేశారు. ఆయనకు భారతరత్న పురస్కారం లభించినట్లు ఎక్స్‌లో ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

రథయాత్ర చేపట్టి...
బీజేపీ ఈరోజు దేశమంతా విస్తరించడానికి, రెండు సార్లు అధికారంలోకి రావడానికి కూడా అద్వానీ చేసిన పలు కార్యక్రమాలు ఒకటి అని చెప్పక తప్పదు. ఆయన చేపట్టిన రధయాత్రతో భారత్ దేశంలోనే హిందూ ఓట్లను పార్టీ పోలరైజ్ చేయగలిగింది. ఈరోజు అద్వానీకి భారత్ రత్న లభించడం అంటే ఆయనకు దక్కిన అరుదైన గౌరవంగానే చెప్పాలి. మోదీ ఈ సందర్భంగా అద్వానీకి శుభాకాంక్షలు తెలిపారు.


Tags:    

Similar News