Beggar : బిక్షగాడి ఆస్తి తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే... నెల సంపాదన ఎంతంటే?

ముంబయికి చెందిన భరత్ జైన్ గత మూడు దశాబ్దాలుగా బిక్షమెత్తుతూ తన జీవనం సాగిస్తున్నాడు

Update: 2023-11-26 05:59 GMT

బిచ్చమెత్తుతున్నాడని తక్కువగా చూడకండి. చేతులు చాస్తున్నాడని అలుసుగా అస్సలు కోపం ప్రదర్శించకండి. ఎందుకంటే వారిలో కోటీశ్వరులున్నారు. మనకంటే సంపద ఉన్న వారు కూడా ఉంటారు. బిక్షగాళ్లు అని ఈసడించుకోవడం అనవసరం. అవసరమైతే తమకు తోచిన సాయం చేయడం తప్ప... బిక్షగాళ్లను తీసివేయలేని పరిస్థితి. వారి రోజువారీ ఆదాయం ఎంతో వింటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. కష్టపడకుండా సంపాదించడం అంటే ఇదే కాబోలు. వారి ముందు మనం ఎందుకూ పనికిరాం.

నెలసరి అద్దెలు...
బిక్షగాళ్లలో కోటీశ్వరులు ఎవరైనా ఉంటారని అనుకున్నారా? అస్సలు ఊహకైనా అందుతుందా? కానీ నిజం. ముంబయిలో ఒక బిక్షగాడు అపర కోటీశ్వరుడు. ముంబయికి చెందిన భరత్ జైన్ గత మూడు దశాబ్దాలుగా బిక్షమెత్తుతూ తన జీవనం సాగిస్తున్నాడు. జీవనం సాగిస్తూనే డబ్బులను కూడబెట్టాడు. అతని వద్ద దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు ఉన్నాయంటే ఆశ్చర్యపోవడం అందరు వంతు అవుతుంది. రోజు వారీ ఆదాయంతో పాటు ముంబయిలో అతనికి ఉన్న భవనాలపై వచ్చే నెలసరి ఆదాయంతో కలపి లక్షల్లో నెలకు సంపాదన ఉంటుంది.
పిల్లల చదువులు...
ముంబయిలోని బాంద్రాలో భరత్ జైన్ కు కోటిన్నర విలువ చేసే రెండు ఫ్లాట్లు, ఠాణేలో రెండు దుకాణాలున్నాయి. వీటి ద్వారా నెలకు లక్షపైనే ఆదాయం వస్తుంది. భరత్ జైన్ తమ పిల్లలను అత్యంత ఖరీదైన విద్యాసంస్థల్లో చదివిస్తున్నారు. అత్యధికంగా ఫీజులు చెల్లిస్తున్నారు. అతడు ఛత్రపతి శివాజీ టెర్మినల్, ఆజాద్ మైదాన్ వద్ద బిక్షమెత్తుతూ నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడంటే నిజమే మరి. అలాగని అతనిని ఎవరూ ఆదర్శంగా తీసుకోకండి. బిక్షమెత్తడం తప్పుకాదు. నేరం అంతకన్నా కాదు కానీ కష్టించి పనిచేసి సంపాదించుకున్న దానిలో తృప్తి బిక్షమెత్తి సమకూర్చుకున్న దానిలో మాత్రం ఉండదు. అది వాస్తవం


Tags:    

Similar News