Ramadan : నేడు రంజాన్.. ముస్లిం సోదరులకు ఈద్ శుభాకాంక్షలు
ప్రపంచ వ్యాప్తంగా నేడు రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు.
రంజాన్ మాసం నెల పూర్తి కావడంతో పాటు నెలవంక కనిపించడంతో ప్రపంచ వ్యాప్తంగా నేడు రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు. దీనిని ఈద్ ఉల్ ఫితర్ అని కూడా పిలుస్తారు. నెలవంకను చూసిన తర్వతనే రంజాన్ పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నెలంతా ఉపవాసం ఉండి ఈరోజు ఈద్ జరపుకోవడం సంప్రదాయంగా వస్తుంది.
నమాజ్ జరుపుకుని...
ఈరోజు ఉదయాన్నే లేచి స్నానమాచరించిన తర్వాత నూతన వస్త్రాలు ధరించి మసీదుకు వెళ్లి నమాజ్ చేస్తారు. ఇంట్లో రుచికరమైన వంటలను తయారు చేసుకుంటారు. బంధుమిత్రులను పిలిచి విందు ఇస్తారు. ఈరోజు ముస్లిం సోదరులంతా కలసి సామూహికంగా ప్రార్థనలు జరుపుతారు. ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు ప్రత్యేకంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.