దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు.. అదుపులో 100 మంది?

దేశ వ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలను నిర్వహిస్తుంది. మొత్తం పది రాష్ట్రాల్లో ఈ తనిఖీలు నిర్వహిస్తుంది.

Update: 2022-09-22 02:36 GMT

దేశ వ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలను నిర్వహిస్తుంది. మొత్తం పది రాష్ట్రాల్లో ఈ తనిఖీలు నిర్వహిస్తుంది. పీఎఫ్ఐ, ఎస్డీఎఫ్ఐ దాని అనుబంధ సంస్థల్లో ఈ సోదాలను జరుపుతోంది. ఉత్తర్‌ప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఏపీలోని కర్నూలు ఖడగ్‌పూర్ లో ఎన్ఐఏ సంస్థ సోదాలను నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా స్థానికులకు, ఎన్ఐఏ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది.

ఏపీ, తెలంగాణలోనూ...
మతపరమైన సంస్థల్లో సోదాలను నిర్వహిస్తుండటంతో స్థానికులు అభ్యంతరం చెబుతున్నారు. ఎన్ఐఏకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. టెర్రర్ ఫండింగ్ పై ఆరా తీస్తున్నారు. పీఎఫ్ఐ సంబంధిత నేతల ఇళ్లల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ వంద మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News