ఉత్తరాఖండ్ లో భారీ వర్షం.. చిక్కుకున్న 200 మంది యాత్రికులు
ఉత్తరాఖండ్ లో కుండపోత వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
ఉత్తర భారత దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఉత్తరాఖండ్ లో కుండపోత వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు వరదనీటిలో చిక్కుకుని గల్లంతయ్యారు. నౌతాడ్ టోకోలో పర్వతాల మీద నుంచి వచ్చిన నీటి ఉధృతికి ఒక హోటల్ కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతయ్యారు. టెహ్రీలో ఇద్దరు మరణించారు.
సహాయక చర్యలు...
కేదార్‌నాథ్ లో పర్యాటకులు 200 మంది చిక్కుకున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కొన్ని రహదారులను మూసివేశారు. వర్షం సృష్టించిన బీభత్సంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు.