ఎండలో 7 కిలోమీటర్లు నడక.. కడుపులో బిడ్డ సహా నిండు గర్భిణి మృతి

సోనాలి తిరిగి మళ్లీ హైవే నుంచి ఇంటికి 3.5 కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరుకుంది. మొత్తం 7 కిలోమీటర్లు ఎండలో నడవడంతో..

Update: 2023-05-16 11:48 GMT

pregnant woman died

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దహను తాలూకాలో నిండు గర్భిణి అయిన ఓ గిరిజన మహిళఎర్రటి ఎండలో.. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లేందుకు 7 కిలోమీటర్లు నడిచింది. దాంతో ఆమెకు వడదెబ్బ తగిలి కడుపులో బిడ్డతో సహా ఆ మహిళ మృతి చెందింది. ఇందుకు కారణం.. ఎంత అభివృద్ధి చెందినా.. ఆ పల్లెకు అంబులెన్స్ వెళ్లే దారి లేకపోవడం.

ఓసర్ వీరా గ్రామానికి చెందిన సోనాలి వాఘాట్ (21) 9 నెలల గర్భిణి. శుక్రవారం (మే12) పాల్ఘర్ జిల్లాలోని తవా పీహెచ్ సీ కి మెడికల్ చెకప్ కు వెళ్లాల్సి ఉంది. ఆ గ్రామానికి సరైన రోడ్డుమార్గం లేదు. అంబులెన్సులు రావు. దాంతో వేరేదారి లేక సోనాలి ఎర్రటి ఎండలోనే 3.5 కిలోమీటర్లు నడిచి సమీపంలోని హైవే పైకి చేరుకుంది. అక్కడి నుంచి తవా పీహెచ్‌‌సీకి వెళ్లింది. ఆమెకు చికిత్స చేసిన అనంతరం వైద్యులు ఇంటికి వెళ్లాలని సూచించారు.
సోనాలి తిరిగి మళ్లీ హైవే నుంచి ఇంటికి 3.5 కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరుకుంది. మొత్తం 7 కిలోమీటర్లు ఎండలో నడవడంతో సాయంత్రానికి సోనాలి అస్వస్థతకు గురైంది. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆమెను దుండల్‌‌వాడి పీహెచ్‌‌సీకి తీసుకెళ్లారు. సొనాలికి చాలా సీరియస్ గా ఉందని గుర్తించిన పీహెచ్‌‌సీ సిబ్బంది కాసా సబ్ డివిజినల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు సోనాలి ఆరోగ్యం మరింత విషమించడంతో.. దుండల్‌‌వాడిలోని స్పెషాలిటీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడికి అంబులెన్స్ లో తీసుకెళ్తుండగానే సోనాలి, ఆమె కడుపులోని బిడ్డతో సహా కన్నుమూసింది. సోనాలి వడదెబబ్బ కారణంగా మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.


Tags:    

Similar News