టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మంటలు
స్పైస్ జెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. పాట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత మంటలు వ్యాపించాయి
స్పైస్ జెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. పాట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత మంటలు వ్యాపించాయి. దీంతో విమానాన్ని పాట్నా విమానాశ్రయంలోనే అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇంజిన్ లో మంటలు చెలరేగడాన్ని గుర్తించిన ప్రయాణికులు కేకలు వేయడంతో పైలెట్లు అప్రమత్తమయి విమానాన్ని అక్కడే సురక్షితంగా దించగలిగారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
తృటిలో తప్పిన ప్రమాదం....
స్పైస్ జెట్ విమానం పాట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరింది. బయలుదేరిన కొద్దిసేపటికే ఎడమ ఇంజిన్ ను ఒక పక్షి ఢీకొట్టింది. దీంతో ఆ ఇంజిన్లో మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించడాన్ని గుర్తించిన ప్రయాణికులు కేకలు పెట్టడంతో పైలట్ అప్రమత్తమై వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో 185 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.