దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం
దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది.
దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ పర్వత ప్రాంతంలో శనివారం సాయంత్రం భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై 5.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మనీ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ వెల్లడించింది. భూకంప కేంద్రం 195 కిలో మీటర్ల లోతన గుర్తించారు. ఈ ప్రభావం ఢిల్లీ, ఎన్సీఆర్ సహా పలు ప్రాంతాలపై పడింది. దీంతో ఇక్కడ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. NCS ప్రకారం, భూకంపం రాత్రి 9:31 కు వచ్చింది. భూమి లోపల 181 కి.మీ.లో భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు.
జమ్ము కశ్మీర్‌లోను 5.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. జమ్మూ కశ్మీర్ గుల్‌మార్గ్ లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 8.36 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.2గా నమోదైంది. గుల్‌మార్గ్‌కు 184 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలం నుంచి 129 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించిచారు. ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం అందలేదు.