Revanth Reddy : కమ్మవారు ఎక్కడున్నా సులువుగా గుర్తించవచ్చు

కమ్మ సామాజికవర్గం వాళ్లు ఎక్కడ ఉన్నా సులువుగా గుర్తు పట్టవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

Update: 2024-07-20 08:19 GMT

కమ్మ సామాజికవర్గం వాళ్లు ఎక్కడ ఉన్నా సులువుగా గుర్తు పట్టవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎక్కడ నీరు పుష్కలంగా ఉంటుందో? ఎక్కడ పంటలు బాగా పండుతాయో అక్కడ కమ్మ వారు ఉంటారని ఆయన అన్నారు. కష్టపడే మనస్తత్వం ఉన్న సామాజికవర్గం కమ్మ కులం అని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో జరిగిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. కమ్మ అంటే అమ్మలాంటి వారని, అమ్మ బిడ్డ కడుపును చూసినట్లే కమ్మ వారు వ్యవసాయం చసి అందరికీ అన్నం పెడతారని అన్నారు. కమ్మ సామాజికవర్గం ఎక్కడ ఉంటే అక్కడ పంటలు సమృద్ధిగా పండుతాయని ఆయన అన్నారు.

నిరసనలు అణిచివేస్తే...
తనకు ఎందరో కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలు సన్నిహితులుగా ఉన్నారన్న రేవంత్ రెడ్డి తాను మాట్లాడటం నేర్చుకున్నది, రాజకీయ అవగాహన అలవర్చుకున్నది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లోని లైబ్రరీ నుంచే నని తెలిపారు. తెలంగాణలోనూ కమ్మ సామాజికవర్గం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అందరినీ ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికీ నిరసనను తెలియ చేసే హక్కు ఉంటుందని, వాటిని కాలరాస్తే దాని ఫలితం ఎలాం ఉంటుందో డిసెంబరు 3వ తేదీన చూశామని ఆయన అన్నారు. వెంకయ్య నాయుడు లాంటి వారు అత్యున్నత స్థాయికి ఎదుగుతారని ఎవరైనా అనుకున్నామా? అని ప్రశ్నించారు. కష్టించే తత్వమే వారిని అత్యున్నత స్థానాలకు తీసుకెళ్లగలిగిందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News