Telangana Govt on Dharani : ధరణిపై టీ సర్కార్ కీలక నిర్ణయం

రణి పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం చేసింది. ధరణి దరఖాస్తులు చేసుకునేందుకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.

Update: 2024-03-11 11:42 GMT

Telangana Govt on Dharani :ధరణి పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం చేసింది. ధరణి దరఖాస్తుల పరిశీలనకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 17వ తేదీ వరకూ గడువు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ధరణిలో సమస్యలు ఏవైనా ఉంటే వారు ఈ నెల 17వ తేదీ వరకూ దరఖాస్తులు పరిశీలన చేసే వీలుంది.

గడువును పొడిగిస్తూ...
గత ప్రభుత్వం ధరణి పోర్టల్ ను ప్రారంభించి, అన్ని భూముల వివరాలను అందులో పొందుపర్చిన సంగతి తెలిసిందే. అయితే తమ భూములను అప్పనంగా కొందరు కాజేశారంటూ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి లెక్కకు మించి ఫిర్యాదులు అందుతున్నాయి. ధరణి స్థానంలో కొత్త పోర్టల్ ను ప్రవేశపెట్టాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. ధరణిలో ఉన్న లొసుగులను అధ్యయనం చేయడానికి కమిటీని కూడా నియమించింది. ఇప్పుడు తాజాగా ధరణి సమస్యలను తెలియచేయడానికి గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News