ఆంధ్రా సెటిలర్స్ కి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన పాడి కౌశిక్ రెడ్డి...!
హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కి, శెర్లింగం పల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కి మధ్య జరుగుతున్న వ్యక్తిగత యుద్ధం..!!
ఇది హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కి, శెర్లింగం పల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కి మధ్య జరుగుతున్న వ్యక్తిగత యుద్ధం..!!
నేను వ్యక్తిగతంగా గాంధీ గారిని అన్నాను కానీ.. ఇక్కడ నివసిస్తున్న ఆంధ్ర సెటిలర్స్ మీద వ్యక్తి గతంగా నాకు చాలా గౌరవం ఉంది. గతంలో కేసీఆర్ గారు కూడా చెప్పారు ""ఇక్కడ నివసిస్తున్న ఆంధ్ర సెటిలర్స్ కాలికి ముల్లు గుచ్చుకున్న నా పంటితో తీస్తా.."" అని.దానికి అనుగుణంగానే పరిపాలన కూడా కొనసాగింది ..అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు..!
తెలంగాణ లోని హైదరాబాద్ లో.. గురువారం అరికెపూడి గాంధీ మరియు పాడి కౌశిక్ రెడ్డి కి జరిగిన వాగ్వాదం తో ఒకేసారి తెలంగాణ రాజకీయాలు ఆంధ్ర తరహా రాజకీయ వాతావరణాన్ని తలపించాయి... ఇప్పటి వరకు తెలంగాణ లో ఏం పార్టీ అధికారంలో ఉన్నా...రాజకీయ నాయకులు ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకునే వారు.కుటుంబంలోని వ్యక్తుల జోలికి కానీ,వారి మీద దాడికి గానీ ప్రయత్నించిన దాఖలాలు ఎక్కడా లేవు...!!
కానీ గురువారం జరిగిన రాజకీయాలు...ఈ ప్రతిపాదన ని చెరిపేసాయి... ఈ వివాదానికి కేంద్ర బిందువు గా నిలిచిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి గురువారం ఉదయం 11 గంటలకు అరికెపూడి గాంధీ ఇంటి మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తా అని సవాలు విసిరాడు..
దీనికి సమాధానంగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ 11 గంటలకు వచ్చి తన ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగరవేయకపోతే...తనే 12 గంటలకు హైదరాబాద్ లోని పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తానని ప్రతి సవాల్ విసారాడు..!! చెప్పినట్లు గానే.... అరికెపూడి గాంధీ తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి మూకుమ్మడిగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి మీదకి వెళ్ళి దాడి చేసాడు. దాడి అనంతరం కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ... ఆంద్ర సెటిలర్స్ అనే పదం ఉపయోగించి వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేసారు. దానికి వివరణ ఇచ్చే పనిలో భాగంగా.. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు..!!